Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిట్యాల
మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో గురువారం ఉప సర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం నిర్వహించారు. మొత్తం 12 మంది వార్డు సభ్యులు కాగా ఉప సర్పంచ్ , ఒకరు వార్డు సభ్యులు గెర్హజరవగా పదిమంది వార్డు సభ్యులు పాటు సర్పంచ్‌తో కలిసి సమావేశానికి హాజరయ్యారు. పదిమంది వార్డు సభ్యులు ఉప సర్పంచ్ ను తొలగించాలని కోరడంతో సర్పంచ్ తటస్థంగా ఉండడంతో ఉప సర్పంచ్ అనర్హుడిగా ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి ప్రకటించారు. ఈ నివేదికను కలెక్టర్‌కు పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కష్ణారెడ్డి, ఎంపీవో పద్మ, కార్యదర్శి గౌతమ్ రెడ్డి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీిఐ శంకర్ రెడ్డి, చిట్యాల ఎస్ఐ నాగరాజు, నార్కట్పల్ల్లి ఎస్ఐ యాదయ్య, పాల్గొన్నారు.