Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
యాదాద్రి భువనగిరి జిల్లాలో గతంలో అధికారులు హైదరాబాద్ నుంచి వస్తూ పోతూ సమయపాలన పాటించకపోవడం , వచ్చినా, రాకపోయినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. వచ్చిన సరిగా విధులు నిర్వహించే వారు కాదు. కానీ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో పాలన పగ్గాలు చేపట్టిన కలెక్టర్ పమేలా సత్పతి సమయపాలన పాటించకపోవడం ఆ విధి నిర్వహణలో అలసత్వం వహించడం ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే పలువురు తహసీల్దార్లకు నోటీసులు జారీ చేశారు. మొదటగా డీపీఆర్ఓగా పనిచేసిన పద్మ ను సస్పెండ్ చేస్తూ ఆ శాఖకు సరెండర్ చేశారు.ఆలేరు మున్సిపల్ కమిషనర్ విధినిర్వహణలో అలసత్వం వహించినందుకు గాను ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో పర్యవేక్షకులు పనితీరులో మార్పు చేయడం కోసం సెక్షన్లను మార్పు చేశారు.ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న సాయిబాబా విధి నిర్వహణలో సక్రమంగా విధులు నిర్వహించే పోవడంతో ఆయనకు ఒక సారి అవకాశం కల్పించినప్పటికీ, మార్పు రాకపోవడంతో గురువారం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అధికారులో మొదలైన అలజడి
జిల్లాలో మొక్కుబడిగా పనిచేసే అధికారులకు కలెక్టర్ పనితీరుతో వారి గుండెల్లో అలజడి మొదలైంది. జాబు చార్టర్ ప్రకారం పనిచేసే అధికారులకు ప్రోత్సహిస్తూ, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను నోటీసులు జారీ చేస్తూ, జిల్లాలో పరిపాలనపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. ఏదేమైనా ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని, అధికారులు హైదరాబాద్ నుంచి రాకపోకలు కొనసాగించ వద్దని, స్థానికంగా ఉంటూ స్థానిక సమస్యలను పరిష్కరించడానికి అధికారులు పనిచేయాలని కలెక్టర్ కోరుతున్నారు.