Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ -కట్టంగూరు
ప్రజా సమస్యలపై ఉద్యమించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని చెరువుఅన్నారం గ్రామంలో ఆ పార్టీ 19వ శాఖ మహా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను సీనియర్ నాయకులు రాజమల్లు ఎగరవేశారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. కేంద్రం ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకు వచ్చిందని,అందుకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి చిలుముల కష్ణయ్య, పార్టీ మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, నాయకులు చిలుముల రామస్వామి,కక్కిరేణి రామస్వామి ,గార్ద సతీష్,నంద్యాల రాంరెడ్డి, దశరథ, శాంతి కుమార్ గంట వెంకన్న, రవీంద్రచారి, సుధాకర్, శంకర్ పాల్గొన్నారు.