Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అప్రమత్తమవుతున్న ఉద్యోగులు
నవతెలంగాణ- నల్లగొండ
ఆరేండ్ల కిందట నల్గొండ మున్సిపాలిటీ ఖజానా నుంచి రూ.5 కోట్లా 4లక్షల నిధులు స్వాహా చేసిన అక్రమ అధికారుల అరెస్టులు కొనసాగుతున్నాయి.ఆరేండ్ల నుండి కొనసాగుతున్న విచారణ చివరి దశకు చేరుకోవడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈనెల 13న ముగ్గురు ఉద్యోగులను అరెస్టు చేసి రిమాండ్ఖు తరలించగా మరో ముగ్గురు ఉద్యోగులను బుధవారం రాత్రి వారి నివాసాల వద్ద అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు. నివాసాల వద్ద అరెస్టు చేసిన వారిలో, (బిల్ కలెక్టర్) బిక్షం, ముంత మల్లేశం, కార్యాలయ (సబా ర్డినేటర్) భాను కుమార్( ఎన్ ఎం ఆర్) ఉన్నారు. మరికొంత మంది మున్సిపల్ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉన్నత అధికారులు ఆరా....
నల్లగొండ మున్సిపాలిటీలో వరుసగా అక్రమార్కుల ఉద్యోగుల అరెస్టులు కొనసాగడంతో రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులు నల్లగొండ మున్సిపాలిటీ పై దృష్టి సారించారు. ఉన్నతాధికారులు నల్లగొండ పోలీసుల నుంచి సమాచారం సైతం తెలుసుకున్నట్టు సమాచారం. నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో అక్రమార్కులు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు మిర్యాలగూడ సూర్యాపేట పెద్ద అంబర్ పేట పురపాలకలో ప్రస్తుత విధులు నిర్వహిస్తున్నారు.
అప్రమత్తం అవుతున్న ఉద్యోగులు
అవినీతి కుంభకోణంలో పాత్రదారులైన ఉద్యోగులు అరెస్టు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్టు సమాచారం. రోజు విడిచి రోజు ముగ్గురు చొప్పున ఉద్యోగులను అరెస్టు చేయడంతో ఆ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. కొందరు ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా అందుబాటులో లేకుండా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిసింది. నేరుగా ఆర్థిక నేరాలకు పాల్పడిన ఉద్యోగులే కాకుండా పర్యవేక్షణలో దానికి బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు ఆదేశించింది.