Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
అ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
అ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ -రామన్నపేట
వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వస్తున్న రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పరీక్షించకుండానే బయటికి పంపిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని ఇది సరైన పద్ధతి కాదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల వార్డును, ప్రసూతి, సాధారణ వార్డులను ఆమె నిశితంగా పరిశీలించారు. రోగుల బెడ్ పై దుప్పట్లు లేకపోవడం చూసి ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణ ఆసాంతం పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉండడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే శుభ్ర పరచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రోగుల పట్ల సేవా దక్పథంతో వ్యవహరించాలన్నారు. గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయడంలో స్థానిక వైద్యులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని అలా చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆమె వెంట సూపరిండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, నాయబ్ తహసీల్దార్ ఎండి.ఇబ్రహీం, డాక్టర్ రవికుమార్, సిబ్బంది ఉద్యోగులు ఉన్నారు.