Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వర్చువల్‌గా ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రామచంద్రారావు
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును గురువారం వర్చువల్‌గా ఆన్లైన్ ద్వారా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఎస్.రామచంద్రారావు ప్రారంభించారు. ఈ వేడుకల్లో హైకోర్టు జడ్జిలు షమీమ్ అక్తర్, రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మణ్, అభినందకుమార్ చావిలి, వినోద్‌కుమార్‌తోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధానన్యాయమూర్తి మద్దిరాల వెంకటరమేశ్, అడిషనల్ జిల్లా జడ్జి నాగరాజు, ఇక్కడి ఇన్ఛార్జీ జడ్జి కలిదిండి దుర్గారాణి, కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ నారాయణరెడ్డి, ఆర్డీఓ సూరజ్‌కుమార్, ఏసీపీ ఉదరురెడ్డి, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవి.రమేశ్‌కు న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జ్యోతిప్రజ్వలన చేశారు. కోర్టు భవనం గదిని ఆయన ప్రారంభించారు. భవనం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఎంవి.రమేశ్ మాట్లాడుతూ మామూలుగా నాలుగు ఆలయాలు దేవాలయం, విద్యాలయం, ఆరోగ్యాలయం, న్యాయాలయం ఉంటాయన్నారు. న్యాయాలయాన్ని ఓ దేవాలయంగా తాను భావిస్తానని తెలిపారు. చట్టపరిధిలో న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమన్నారు. చట్టపరిధి అనేది కొంతవరకే ఉంటుందన్నారు. ధర్మం, న్యాయం, చట్టం మూడూ చూడడానికి ఒకేలా ఉన్నా వాటికి చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు. ఈ కోర్టు పరిధిలో సంస్థాన్‌నారాయణపురం, పోచంపల్లి మండలాలు వస్తాయన్నారు. అనంతరం మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు ఎంవి.రమేశ్‌ను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కె.నర్సింహారెడ్డి, వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎలమోని శ్రీనివాస్, బాల్యం వెంకటచలపతి, ముత్యాల సత్తిరెడ్డి, ఉడుగు శ్రీనివాస్‌గౌడ్, తాడూరి పరమేశ్, తొర్పునూరి ఈశ్వర్‌గౌడ్, జక్కర్తి శేఖర్, శ్రీశైలం, లక్ష్మయ్య పాల్గొన్నారు.