Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తుంగతుర్తి
వేతనాలు విడుదలలో జాప్యం నివారించాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం ఉప కోశాధికారి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సోంబాబు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలను, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లను ప్రతి నెలా మొదటి తేదీన వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు వెలుగు రమేష్, పి.సోమయ్య,జిల్లా సాంస్కతిక కన్వీనర్ జి ఆంజనేయులు ,మండల అధ్యక్షులు గౌడిచర్ల నరేష్, సంఘం నాయకులు పాలకుర్తి ఎల్లయ్య, బీమననపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.