Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తుంగతుర్తి
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్స వాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్ రాంప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా, మండలాధ్యక్షుడు మహేందర్, ఎంపీటీసీ నరేష్‌నాయక్, కత్తుల నరేష్, వినోద్‌నాయక్, పి.నాగరాజు, చంటి శంకర్, రమేష్, మధు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.