Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హుజూర్నగర్
పలువురు లబ్దిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మీ, శాదీ ముబారక్ చెక్కులను గురువారం ఎమ్మెల్యే ఎమ్మెల్యే సైదిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కావొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయశ్రీ, మార్కెట్ కమిటీ చైర్మెన్ కడియాల వెంకట్‌రెడ్డి, మున్సిపాలిటీ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మెన్ జక్కుల నాగేశ్వర్రావు, కౌన్సిలర్లు ఎరగాని గురువయ్య, ఆర్ఐ శ్రీను పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని కరోనా రహితంగా చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 27వ వార్డులో వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 18 ఏండ్లు నిండిన వారంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ కడియం వెంకట్‌రెడ్డి, ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యులు లక్ష్మణ్‌గౌడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.