Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు మొగుదాల రమేశ్‌గౌడ్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కొయ్యడ సైదులుగౌడ్ మాట్లాడారు. చౌటుప్పల్ ఊరచెరువు అలుగు విషయంలో ప్రజలు, వ్యాపారస్తులకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌చేశారు. సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణం తదితర అభివద్ధి పనుల కోసం ప్రభుత్వం వంద కోట్ల రూపాయల నిధులు వెంటనే విడుదలచేయాలన్నారు. మున్సిపల్ సమస్యలపై అవగాహన లేని చైర్మెన్ ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. అనంతరం కమిషనర్ నర్సింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉబ్బు వరమ్మవెంకటయ్య, కాసర్ల మంజులశ్రీనివాస్రెడ్డి, సందగల్ల విజయసతీశ్గౌడ్, పోలోజు వనజ, కామిశెట్టి శైలజ, నాయకులు కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, చిక్క నర్సింహా, ఉబ్బు వెంకటయ్య, రావుల స్వామి, చామకూర రాజయ్య, యాదయ్య, ఆవుల యేసు, ఎస్కె.జానీబాబు పాల్గొన్నారు.