Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరిటౌన్
జిల్లాలోని అన్ని గ్రామాలకూ బస్సులు నడపాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బస్టాండ్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వనం రాజు మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమైనా ఆర్టీసీ అధికారులు గ్రామాలకు పూర్తి స్థాయిలో బస్సులు నడిపించడం లేదన్నారు. బస్సులు రాక విద్యార్థులు ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్టీసీ అధికారిణికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చింతల శివ, సందేల రాజేష్, బుగ్గ ఉదరు కిరణ్, ప్రకాష్, కంగాపాక రంజిత్, జమ్ము అంబికా, చిన్నం మానస పాల్గొన్నారు.