Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ కోరారు. శుక్రవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో మెప్మా రిసోర్స్ పర్సన్లకు, ఏఎన్ఎం, నర్సింగ్ విద్యార్థులతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ వేస్తుందని తెలిపారు. పట్టణంలోని 48 వార్డుల్లోనూ వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో రవి, మున్సిపల్ కమిషనర్ సాయిలక్ష్మి, ప్రభుత్వ డాక్టర్లు ప్రత్యూష, రామకృష్ణ, టీఎంసీ బక్కయ్య, సీఓలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, పార్వతి, జాని, ఆశా వర్కర్లు, నర్సింగ్ విద్యార్థులు, రీసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.