Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
బెల్లి యాదయ్య
నవతెలంగాణ - రామన్నపేట
ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఓ ప్రత్యేకత ఉందని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య అన్నారు. శుక్రవారం స్థానిక కళాశాల ఆవరణలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో 'తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17' అనే అంశంపై విద్యార్థులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 17 చారిత్రక ప్రధాన్యతపై 15 మంది విద్యార్థులు ప్రసంగ పత్రాలను సభకు సమర్పిస్తూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వివిధ గ్రామాల గొప్పతనాన్ని, మహనీయుల త్యాగాలను స్మరించారు. ఈ కార్యక్రమంలో చరిత్ర అధ్యాపకులు డా.కాంతయ్య, చరిత్ర ఇన్చార్జి విభాగాధిపతి షేక్.పీర్‌సాహెబ్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, ఏవో మంజర్జాఫ్రి, అకడమిక్ కోఆర్డినేటర్ యాదగిరి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఇందిర, రూసా కోఆర్డినేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.