Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గాదరి కిషోర్
నవతెలంగాణ - నాగారం
మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేయూతను అందిస్తుందని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పెద్ద చెరువులో చేపలు వదిలి మాట్లాడారు. జిల్లాలోని 188 చెరువుల్లో చేప పిల్లలు వదులుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారిని సౌజన్య, అసిస్టెంట్ అధికారిని సుమలత, ఉపేందర్, ఎంపీపీ కూరంమణి, వెంకన్న, వైస్ ఎంపీపీ మణిమాల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉప్పలయ్య, గుండగాని అంబయ్య, తహసీల్దార్ హరిశ్చంద్రప్రసాద్, ఎంపీడీవో శోభారాణి, ఎలక్ట్రికల్ ఏఈ సతీష్, జిల్లా మత్స్యశాఖ కాంట్రాక్టర్ మర్రిపెద్ది శ్రీను, సర్పంచ్ చిప్పలపల్లి స్వప్న, ఉప సర్పంచ్ భద్రయ్య పాల్గొన్నారు.