Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ-దేవరకొండ
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని రిటెర్డ్ ఉద్యోగ సంఘం భవనంలో 103మందికి మంజూరైన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కలను పంపిణీ చేసి మాట్లాడారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం కింద ఆరేండ్లుగా దేవరకొండ మండలంలో రూ.11.16 కోట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగసు జాన్యాదవ్, జెడ్పీటీసీ మరుపాకుల అరుణసురేష్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్.రెడ్డి,హన్మంత్ వెంకటేష్ గౌడ్, వైస్ చైర్మన్ రహత్ అలీ,వేముల రాజు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నేనావత్ శ్రీను పాల్గొన్నారు.
సందేశాత్మక చిత్రం రైతన్న
ఆర్.నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన రైతన్న చిత్రం సందేశాత్మకమైందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్లో రైతన్న సినిమాను వీక్షించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. రైతుల సమస్యలను తెరకెక్కించిన రైతన్న చిత్రం అద్భుతంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, ఎంపీపీలు నల్లగసు జాన్ యాదవ్,వంగల ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీ మరుపాకుల అరుణసురేష్ గౌడ్,కేతవత్ బాలు,వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, కేసాని లింగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు టీవీఎన్.రెడ్డి, ముత్యాల సర్వయ్య, వేలుగురి వల్లపురెడ్డి పాల్గొన్నారు.