Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బీబీనగర్
మండల కేంద్రంలోని పెద్దచెరువు వద్ద వినాయక నిమజ్జనానికి చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జన ఏర్పాట్లలో అవాంతరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తుగా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయనవెంట డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ వెంకట్రెడ్డి, భువనగిరి రూరల్ సీఐ జానయ్య, తహశీల్దార్ వెంకట్రెడ్డి, ఎస్ఐ రాఘవేందర్, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.