Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ - నల్లగొండ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో 10 వేల ఎకరాల భూమి పంపిణీ చేశారన్నారు. 4000 మంది అమరులయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధమూ లేని బీజేపీ మత పోరాటంగా చిత్రీకరిస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతుందని అన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కట్టబెడుతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయ ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, జిల్లా కమిటీ సభ్యులు పాలడుగు ప్రభావతి, దండెంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి, మైల యాదయ్య, అద్దంకి నర్సింహా, భూతం అరుణ, గుండాల నరేష్, పోలే సత్యనారాయణ, ఆకిటి లింగమ్మ, మధుసూదన్‌రెడ్డి, గాదె నర్సింహా, ఉమారాణి, కోట్ల అశోక్‌రెడ్డి, మారయ్య పాల్గొన్నారు.