Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ - తిరుమలగిరి/రూరల్
సామాజిక అంతరాలు తొలిగి దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వంగపెళ్లి నర్సయ్య ఫంక్షన్హాల్లో దళితబంధు పథకంపై నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. దళితులు అసమానత లకు లోనవుతున్నారని, సామాజిక అంతరాలు తొలగాలని ఆనాడు అంబేద్కర్, గాంధీలు కోరుకున్నారని తెలిపారు. వారి ఆలోచనాలకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ దళితుల కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ దళిత బంధు పథకం మండలం లోని అన్ని దళిత కుటుంబాలకు అందుతుం దన్నారు. చదువుకున్న యువకులు ముగ్గురు నలుగురు కలిసి ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో తిరుమలగిరి మండలాన్ని దళిత బందులో చేరడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి మాట్లాడుతూ అధిక ఆదాయలతో పనిలేకుండా దళితబంధు ప్రతి దళిత కుటుంబానికి అందుతుందన్నార. కుటుంబంలో పెండ్లి అయి ఉన్న ప్రతి దళిత కుటుంబానికీ ఈ పథకం అమలవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్, మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజనీ రాజశేఖర్, వైస్ చైర్మన్ ఎస్.రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ నెమరు గొమ్ముల స్నేహలత, జెడ్పీటీసీ దూపటి అంజలి, జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ పటేల్, తహసీ ల్దార్ సంతోష్‌కిరణ్, ఎంపీడీవో ఉమేష్‌చారి, కమిషనర్ దండు శ్రీను తదితరులు పాల్గొన్నారు.