Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి
నవతెలంగాణ - నార్కట్‌పల్లి
పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని నక్కలపల్లి, షాపల్లిలోని పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల నమోదు పెంపుదల, హాజరు, పాఠశాల ఆవరణ పరిశుభ్రత వంటి అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. షాపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థుల నైపుణ్యాన్ని తెలుసుకున్నారు. నెమ్మాని పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులు ఉన్నారు.
కలెక్టర్‌ను కలిసిన నూతన విద్యాశాఖాధికారి
నవతెలంగాణ - సూర్యాపేటటౌన్
సూర్యాపేట జిల్లాకు కొత్తగా వచ్చిన డీఈవో మహమ్మద్ అబ్దుల్ మునాఫ్ శుక్రవారం కలెక్టర్ టి.వినరు కృష్ణారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈయన ప్రస్తుతం నల్లగొండలోని బీఈడీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తూ ఇక్కడికి డీఈవోగా వచ్చారు.