Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ - వలిగొండ
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని బీజేపీ హిందూ ముస్లింల మధ్య పోరాటంగా చిత్రీకరిస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని సాయుధ పోరాట అమరవీరుల స్థూపాల వద్ద నివాళులర్పించి మాట్లా డారు. వెట్టిచాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో అనేక మంది అమరులయ్యారని గుర్తు చేశారు. పులిగిల్ల గ్రామంలో 51 మంది, సుంకిశాల గ్రామంలో ఐదుగురు తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, బట్టుపల్లి అనురాధ, కల్లూరి మల్లేశం, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశం, మండల కార్యదర్శి మద్దెల రాజయ్య, సీనియర్ నాయకులు కొమ్మిడి లక్ష్మారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు స్వామి, నాయకులు వెంకట్‌రెడ్డి, కిష్టయ్య, సురేందర్, బుగ్గ చంద్రమౌళి, వెంకటేశం, శ్రీశైలంరెడ్డి, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భూదాన్ పోచంపల్లి : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవ సభలో ఆయన మాట్లాడారు.
సాయుధ పోరాటాల ద్వారా 10 లక్షల ఎకరాల భూమిని అర్హులైన పేద ప్రజలకు పంచిన ఘనత కమ్యూనిస్టులకే దక్కిందన్నార. తెలంగాణ సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధమూ లేని బీజేపీ నేడు సాయుధ పోరాటానికి నిజమైన వారసులం మేమే అని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.
పార్టీ జిల్లా కార్యదర్శి జహంగీర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, మాటూరి బాలరాజు, బట్టుపల్లి అనురాధా, పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి లింగారెడ్డి, శాఖ కార్యదర్శి మార్త సత్యనారాయణ, ప్రసాదం విష్ణు, మంచాల మధు, గూడూరు బుచ్చిరెడ్డి, జ్యోతి, బిక్షపతి, అంజయ్య, యాదయ్య పాల్గొన్నారు.
రావి నారాయణరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి
భువనగిరి రూరల్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాం నవాబు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి రావి నారాయణ రెడ్డి అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. శుక్రవారం మండలంలోని నాగిరెడ్డిపెల్లి గ్రామంలో ఉన్న రావి నారాయణరెడ్డి స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకున్న వందల ఎకరాల భూములను పేద ప్రజలకు పంచి దేశంలోనే ఆదర్శ నేతగా నిలిచారన్నారు. పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే అప్పటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక ఓట్లు సంపాదించిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి అని తెలిపారు. ఆయన దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మ విభూషణ్, కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించిందని గుర్తు చేశారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వారి త్యాగాలను గుర్తించాల్సింది పోయి కొన్ని రాజకీయ పార్టీలు మతతత్వ అజెండాను ముందుకు తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నాయని తెలిపారు.
పార్టీ జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్ మాట్లాడుతూ రావి నారాయణరెడ్డి దేశ స్వతంత్య్ర సంగ్రామంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గూడూర్ అంజిరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ మడుగు నర్సింహా, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్‌గౌడ్, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహా, మండల కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్‌గౌడ్, ఎల్లముల వెంకటేష్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పన శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనిస్టుల పోరాటాలతోనే నాడు భూ పంపిణీ
బీబీనగర్ : కమ్యూనిస్టుల పోరాటాలతోనే నాడు లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. శుక్రవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గల కొమ్మిడి కోదండరామిరెడ్డి విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలతో రైతులు, కార్మికులు, సాధారణ ప్రజలు అనేక ఇబ్బందులు పడతారన్నారు. మోడీ అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 27న నిర్వహించనున్న భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్, రాష్ట్రకమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మండల కార్యదర్శి బండారు శ్రీరాములు, నాయకులు గాడి శ్రీనివాస్, కందాడి దేవేందర్‌రెడ్డి, బాలబోయిన జంగయ్య, ఉపేందర్ పాల్గొన్నారు.