Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్
పమేలా సత్పతి
నవతెలంగాణ - భువనగిరి రూరల్
అన్ని సంక్షేమ శాఖల సమన్వయంతో పోషణ మాసం కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తోన్న పోషణ అభియాన్ మాసం కార్యక్రమాలపై సమీక్షించి మాట్లాడారు. సంక్షేమ శాఖలు పోషణ్ మాసంలో చురుగ్గా పాల్గొని మహిళలు, పిల్లలకు అందించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. బలవర్థకమైన ఆహారం, వ్యాయామం వల్ల కలిగే లాభాల గురించి ప్రతిరోజూ ఉదయం పాఠశాలల్లో ప్రార్థన సమయంలో విద్యార్థులకు వివరించాలన్నారు. జన చైతన్య డాష్ బోర్డులో ప్రతి రోజూ నిర్వహించిన కార్యక్రమాలను అదే రోజు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో కలిసి పోషన్ అభియాన్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్‌రెడ్డి, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి చంద్రకళ, పోషన్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ నాగిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు, జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ, సీడీపీవోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.