Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నిడమనూరు
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఏకంగా భవిష్యత్‌లో పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం నిడమనూరు మార్కెట్ యార్డులో నిర్వహించిన పార్టీ ఏడో మండల మహాసభలో ఆయన మాట్లాడారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై గళమెత్తి పోరాడేది కమ్యూనిస్టు లేనన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్లచట్టాలతో రైతులు కార్మికులతో పాటు, సామాన్య ప్రజలు సైతం తీవ్రంగా నష్టపోతారన్నారు.కార్పొరేట్ శక్తులకు మేలు చేసే చట్టాలను, ప్రజలందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు.కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న జరిగే భారత్‌బంద్ లో టీఆర్ఎస్ పాల్గొని రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.గత పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్ కార్యా చరణను రూపొందించుకుందామని కోరారు.ఈ మహాసభ స్ఫూర్తితో భవిష్యత్‌లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన పార్టీ పోరాడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మలవీరారెడ్డి, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, అవుతా సైదులు, కత్తి లింగారెడ్డి, దైదశ్రీను, కొర్రా శంకర్‌నాయక్, కోమాండ్ల గురవయ్య, కందుకూరి కోటేష్, ఆకారపు నరేష్, నల్లబోతు సోమయ్య, కుంచం శేఖర్, ముత్యాల కేశవులు, మలికంటి చంద్రశేఖర్, ఆరెకంటి రాము, మెరుగురాములు, భాషపాక సైదులు, కోదండ చరణ్‌రాజు, కొండేటిసామంత్ పాల్గొన్నారు.