Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మఠంపల్లి
విష్ణుపురం నుంచి మఠంపల్లి వరకు ప్యాసింజర్ రైలు నడపాలని సౌత్ సెంట్రల్ జోనల్ కమిటీ మెంబర్ ఎరగా నాగన్నగౌడ్ కోరారు. మంగళవారం ఆయన మఠంపల్లి రైల్వే స్టేషన్‌ను సందర్శించి మాట్లాడుతూ మండలంలో సిమెంటు పరిశ్రమలు, మట్టపల్లి దేవాలయం ఉందన్నారు. అందే విధంగా ఇదే ప్రాంతంలో జాన్‌పహాడ్ సైదులుదర్గా సైతం ఉందని, నిత్యం అనేకమంది ఈ ప్రాంతం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారని పేర్కొన్నారు. ప్యాసింజర్ రైలు లేక పోవడంతో ప్రయివేటు వాహనాల్లో వెళ్లలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాసింజర్ రైలు కోసం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు వంటి పులి శ్రీనివాస్, సింగారపు సైదులు గంటా కరుణాకర్‌రెడ్డి, ముక్కంటి, చిలక గురవయ్య, కరీం, పీఎస్సీఎస్ వైస్ చైర్మెన్ బాబు, అచ్చయ్య, నరసింహారెడ్డి, సైదులు పాల్గొన్నారు.