Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేద కుటుంబాలకు డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని ధర్నా
నవతెలంగాణ-మునుగోడు
తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర, దక్షిణ తెలంగాణ వివక్ష చూపుతూ సిద్ధిపేట, సిరిసిల్ల ప్రాంతాల అభివద్ధి మీద ఉన్న శ్రద్ధ చూపిస్తూ జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం విమర్శించారు.మంగళవారం ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.తహసీల్దార్ జక్కరి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.రాష్ట్రంలో ఎక్కడ ఉపఎన్నికలు జరిగితే అక్కడ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందన్నారు.రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏడేండ్ల నుండి ఏ ఒక్క దళిత కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకపోవడం సిగ్గు చేటన్నారు.జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగు,తాగునీరు లేకపోవడంతో ఈ ప్రాంత భూములు బీటలు వారుతున్నాయన్నారు. జిల్లాలో డిండి ప్రాజెక్టు ద్వారా మూడు లక్షల ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతానికి తాగు, సాగునీరందిస్తామని చెప్పిన ప్రభుత్వం డిండి ప్రాజెక్టు నిర్మాణానికి డీపీఆర్ అప్లోడ్ చేయకుండా కనీసం నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు.ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న నిర్వాసులకు కనీసం నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తు న్నారన్నారు.వెంటనే డీపీఆర్ అమలు చేసి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి డిండి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడంతో పాటు మునుగోడు, నల్లగొండ, దేవరకొండ ప్రాంతాలకు సాగు, తాగు నీరందించాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాలు చేపట్టాలని కోరారు. నిజాం రాజులను తరిమికొట్టిన చరిత్ర నల్లగొండ జిల్లాకు ఉందన్నారు.ఈ జిల్లా అభివృద్ధిని ప్రభుత్వం ఆమడదూరంలో ఉంచడం దారుణ మన్నారు. రాబోయే రోజుల్లో నిజాంరాజులను తరిమిన విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను తరిమికొట్టే పరిస్థితి దాపురించిందన్నారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శులు చాపల మారయ్య, నాంపల్లి చంద్రమౌళి, సర్పంచులు మిర్యాల వెంకన్న, పగిళ్ల భిక్షమయ్య, మండల నాయకులు యసరాని శ్రీను, నారగోని నర్సింహ, వడ్లమూడి హనుమయ్య, శివర్ల వీరమళ్లు, మిర్యాల భరత్, వరికుప్పల ముత్యాలు, వేముల లింగుస్వామి, పగిళ్ళ పరమేష్ పాల్గొన్నారు.