Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్న రెండురోజులు భారీ నుండి అతి భారీవర్షాలు వచ్చే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ అధికారులను ఆదేశించారు.సోమవారం ఉదయం ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితి సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు తమ కేంద్ర కార్యస్థానాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.వర్షాలు వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొంగి పొర్లే వాగులు దాటకుండా ముందస్తు చర్యలు, చెరువులు సంరక్షణచర్యలు, సహాయత కొరకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలుసూచనలు చేశారు.వర్షసూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దన్నారు.వాగులు,వంకలు పొంగి పొర్లే ప్రాంతాలల్లో రైతులు పొలం పనులకు వెళ్ళొద్దన్నారు.పశువులను ఇంటి పట్టునే ఉంచాలని, ఈ సమయంలో ప్రజలు ఇంటిపట్టునే ఉండాలని, ప్రయాణాలు సైతం మానుకోవాలని చెప్పారు.ఈ టెలీకాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపుకలెక్టర్ రాహుల్ శర్మ, డీపీఓ విష్ణువర్థన్, జెడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, జిల్లా అగ్నిమాపక అధికారి యజ్ఞ నారాయణ, నల్లగొండ,మిర్యాలగూడ, దేవరకొండ ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, రోహిత్ సింగ్, గోపిరాం పాల్గొన్నారు.