Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాలకీడు
మండలంలోని భవనీపు రంలో ఉన్న డక్కన్ ఫ్యాక్టరీలో మంగళవారం నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. గర్భకోశవ్యాధులు, కంటి పరీక్షలు, కీళ్లనొప్పుల సమస్య ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ క్యాంపుకు శూన్య పాడు, రావి పహాడ్, జానపాడు, కాల్మెట్తండా, చెరువుతండా, కొత్త తండా గ్రామాల నుంచి 421 మంది ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ సీజీఎం ఎస్.శ్రీనివాస్‌రాజు మాట్లాడుతూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా మన వంతుగా సమాజానికి బలాన్ని చేకూర్చిన వారమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎం ఎస్.నాగమల్లేశ్వర్రావు, పీఏ సూర్యనారాయణ పాల్గొన్నారు.