Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అఖిలపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
రాచకొండలో ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న రైతులందరికీ పట్టాలివ్వాలని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాచకొండ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీడీపీ, సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వందల ఏండ్ల నుంచి భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతులను ప్రభుత్వం వేధిస్తోందన్నారు. 1970 నుండి 2004 వరకు గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చిన అటవీ భూములను ప్రభుత్వం గుంజు కుంటుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ రాచకొండ వచ్చి ఫిలిం సిటీ చేస్తానని ప్రకటించి మాటమార్చారన్నారు.కేసీఆర్్ రాచకొండ పర్యటన తర్వాతనే భూమి సమస్యలు మొదలయ్యాయన్నారు. 2006లో అటవీ హక్కుల చట్టం ప్రకారం రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ బ్రహ్మయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వాంకుడోత్ బుజ్జి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి శివరాత్రి విద్యాసాగర్, సీపీిఐ మండల కార్యదర్శి బచ్చనగోని గాలయ్య,రైతు నాయకుడు ఏపూర్ సతీష్, టీడీపీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కుక్కల నరసింహ,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీను నాయక్, ఏర్పుల సుదర్శన్. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి యాదిరెడ్డి, వైసీపీ నాయకులు షరీఫ్, సర్పంచులు కాట్రోతు శ్రీను. జర్పుల కవిత జగన్. తదితరులు పాల్గొన్నారు.