Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
నవతెలంగాణ- ఆలేరుటౌన్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు చేస్తున్న విస్తత సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి మంగళవారం శాసనసభలో సభపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి,సంబంధిత శాఖ మంత్రి దష్టికి తీసుకువెళ్లారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడం హర్షణీయమన్నారు .గర్భిణులకు శ్రీమంతాలు చేయడం, సెంటర్లలోనే భోజన వసతి కల్పించడం ,పౌష్టికాహార వారోత్సవాలు గొప్పగా నిర్వహిస్తున్నారన్నారు .ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే అంగన్వాడీ టీచర్లకు పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. అంగన్ వాడీ టీచర్లకు వేతనాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతెంత చెల్లిస్తున్నాయి వివరించాలని కోరారు. స్థానికంగా కొన్ని జెన్యూన్ కేసులు ఉంటాయని తెలిపారు .నియోజకవర్గంలోని సీతారామపురం గ్రామంలో మైనారిటీ సోదరుడు అందరికీ తలలో నాలుకలాగా ఉండే వ్యక్తి వద్ధ తల్లిదండ్రులు చిన్నారులు ఉండగా ఆయన భార్యకు ఊరు అంతా ఒక్క టీచర్ పోస్టు ఇవ్వాలని ఏకగ్రీవం చేసినప్పటికీ ఇవ్వని పరిస్థితి నెలకొందన్నారు. రిజర్వేషన్ల కారణంగా వారికి ఆ పోస్టు ఇవ్వడం కుదరలేదన్నారు .ఆయాలుగా పనిచేస్తున్న అత్తలకు చేతకానప్పుడు వారిస్థానంలో కోడళ్లు పనిచేయడం చేస్తున్నారన్నారు. ప్రత్యేక పరిస్థితులు ఉన్న చోట విధులు నిర్వర్తించే విధంగా ప్రభుత్వం అనుమతించాలన్నారు. అంగన్వాడీ భవనాలు లేని చోట నూతన భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు.