Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ)ఆర్థిక అభివద్ధి లో ముందు నడవడం శుభ పరిణామమని డీసీసీబీచైర్మెన్, టెస్కాబ్ వైస్ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వంగపల్లిలో నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత,నగదు రహిత లావాదేవీల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కోరారు , 100 ఏండ్ల చరిత్ర కలిగిన సహకార బ్యాంక్ రూ.800 కోట్ల లాభాలు ఉన్నదాన్ని రూ.1500 కోట్లు తీసుకు వచ్చామన్నారు.ఈ ఒక్క ఏడాదే రూ.11 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.కరీంనగర్ తర్వాత నల్లగొండ బ్యాంకు ముందంజలో ఉందని తెలిపారు.విదేశాలకు వెళ్లే రైతు బిడ్డలకు భూమిని పెట్టుకుని రూ.25 లక్షలు రుణం ఇస్తున్నామన్నారు.ఇప్పటికే జిల్లాలో రూ.200 మందికి ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేశామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 120 కోట్లరైతుల కు క్రాప్ లోన్లు మంజూరు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అందేల లింగం యాదవ్ ,నాబార్డ్ డీడీఎం వినరు కుమార్ ,లీడ్ బ్యాంక్ మేనేజర్ రామకష్ణ ,డీసీసీబీ సీఈవో మదన్మోహన్ ఏజీఎం ఉదయశ్రీ ,మేనేజర్ కావ్య,మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ ,గ్రామ సర్పంచ్ కవిత సింగిల్‌విండో డైరెక్టర్లు వీరస్వామి శ్రీనివాస్, ఉపేందర్ ,కష్ణ ,యాదిరెడ్డి ,బిక్షం గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
సహకార సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధించాలి
గుండాల : రైతు సేవా సహకార సంఘాలు పలు రకాల వ్యాపారాలు ఆర్థిక పరిపుష్టి సాధించాలని,సంఘాలు ఆర్థికంగా బలోపేతంగా ఉంటేనే రైతులకు మెరుగైన సేవలు అందించగలుగుతామని టెస్కాబ్ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు.గుండాల సింగిల్ విండో ఆధ్వర్యంలో సోమవారం జరిగిన పలు అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 107 సంఘాలు ఉండగా ఎక్కువ మొత్తంలో గుండాల సంఘానికి రుణాల కోసం రూ.4.50 కోట్ల నిధులు ఇచ్చినట్టు తెలిపారు.ఖరీఫ్‌లో మరో రూ.25లక్షలు ఇస్తామన్నారు. జిల్లాలో ఈసంవత్సరం 40 సంఘాలకు వ్యాపార అభివద్ధికి
రూ.2 కోట్ల చొప్పున ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్,వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్‌రెడ్డి,జిల్లా కోఆప్షన్‌సభ్యుడు ఎండి ఖలీల్,మార్కెట్ వైస్ చైర్మెన్ మూగల శ్రీనివాస్,మాజీ జెడ్పీటీసీ, ఎంపీపీిలు రామకష్ణారెడ్డి, పాండరి గౌడ్,వేణుగోపాల్,హరితాదేవి తదితరులు పాల్గొన్నారు.