Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీఐజీ రంగనాథ్
నవతెలంగాణ -నల్లగొండ
సేఫ్ ఆటో టాక్సీ ద్వారా మహిళలకు మరింత భద్రత ఏర్పడుతుందని డీఐజీ రంగనాథ్ అన్నారు. మంగళవారం ట్రాఫిక్ సీిఐ చీర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ వద్ద ఆటోలకు క్యూఆర్ కోడింగ్, సేఫ్ ఆటో టాక్సీ.కామ్ ద్వారా ఆటోలకు నెంబరింగ్, స్టిక్కరింగ్ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.క్యూఆర్. కోడింగ్ ద్వారా ఆటోలో ప్రయాణించే వారు కోడ్ స్కాన్ చేస్తే ఆటోకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవడమే కాక అత్యవసర పరిస్థితుల్లో మెసేజ్, కాల్ చేసే సదుపాయం కల్పించినట్టు తెలిపారు. అదే సమయంలో క్యూ.ఆర్. కోడింగ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. ఆటో డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేయడం తమ.అభిమతం కాదన్నారు. కానీ ఎవరో ఒకరు చేసే తప్పిదాల కారణంగా మొత్తం ఆటో డ్రైవర్లు అందరికి ఆ మచ్చ వస్తుందన్నారు. జిల్లాలో సుమారుగా 12 వేలకు పైగా ఆటోలు ఉన్నాయని, ఈ స్టిక్కరింగ్ విధానాన్ని జిల్లా మొత్తం త్వరలో అమలు చేస్తామని తెలిపారు. ఆటో డ్రైవర్లు ఇన్సూరెన్స్ సమస్య తద్వారా ఎదురవుతున్న ఫిట్ నెస్ సమస్యలను డీఐజీ దష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యను ప్రభుత్వ దష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్మద, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ట్రాఫిక్ సీిఐ చీర్ల శ్రీనివాస్, ట్రాఫిక్ సిబ్బంది తూడి సుధాకర్, వేముల మహేందర్, వెంకటేశ్వర్లు, కష్ణ, వెంకన్నతో పాటు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
అధిక వడ్డీలు వసూలు చేస్తే నేరుగా సమాచారం ఇవ్వండి
జిల్లాలో అధిక వడ్డీ, బారా, మీటర్ కట్టింగ్ వ్యాపారులపై నిఘా పెట్టడం జరిగిందని, వడ్డీ వేధింపుల విషయంలో బాధితులు నేరుగా తనకు సమచారం ఇవ్వాలని డీఐజీ ఏవి.రంగనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రజలను కోరారు.్త నేరుగా తన ఫోన్ నెంబర్ 9440795600 కు మేజెస్, వాట్స్ అప్ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. మిర్యాలగూడ ప్రాంతంలో ఫైనాన్స్, వడ్డీ వ్యాపారులు అధిక వడ్డిలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నట్లుగా తమ దష్టికి వచ్చిందని దీనిపై విచారణ చేస్తున్నామని తెలిపారు.