Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పేద ప్రజలకు అండ కమ్యూనిస్టులే
అ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
డిసెంబర్ 5, 6, 7తేదీల్లో భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించనున్న సీపీఐ(ఎం) జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆ పార్టీ జిల్లా ఆహ్వాన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుకార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. గ్యాస్ ,పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద ప్రజల పై అనేక భారాలు మోపుతున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. నేటి సమాజంలో పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారన్నారు. పేదల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. ప్రజలమధ్య ఉంటూ ప్రజా క్షేత్రంలో పని చేస్తున్న ఏకైక పార్టీ సీపీఐ(ఎం) అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొంటేందుకు గ్రామ కమిటీని మొదలుకొని జిల్లా కమిటీ వరకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ఆహ్వాన సంఘం కమిటీని ఎన్నుకున్నారు. ఆహ్వాన కమిటీ గౌరవాధ్యక్షునిగా చెరుపల్లి సీతారాములు, అధ్యక్షునిగా గూడూరు అంజి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎండి.జహంగీర్, చీఫ్ ప్యాట్రన్‌గా కొత్త బుచ్చిరెడ్డి, కోశాధికారిగా కొండమడుగు నరసింహ, ఆర్గనైజర్‌గా పగిల్లా లింగారెడ్డి, ప్యాట్రన్లు మంగనర్సింలు, చింతల భూపాల్ రెడ్డి, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, నర్సిరెడ్డి బట్టు పల్లి అనురాధ కోమటిరెడ్డి చంద్రారెడ్డి దాసరి పాండు కోట రామచంద్రారెడ్డి ,ప్రసాదం విష్ణు ,గడ్డ వెంకటేశం, మంచాల మధు ,గూడూర్ బుచ్చి రెడ్డి ,మార్త సత్యనారాయణ, వివిధ మండలాల కార్యదర్శులను ఎన్నుకున్నారు.