Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
75 ఏండ్ల స్వాతంత్య్ర పండుగ ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆజాద్‌కి అమృత్ మహేత్సవాల్లో భాగంగా మంగళవారం ఫిట్ఇండియా ఫ్రీడం రన్2.0ను నిర్వహించారు. 200 మీటర్లు పొడవు గల జాతీయ పతాకాన్ని స్థానిక ప్రభుత్వపాఠశాలల సుమారు 200 మంది విద్యార్థులచే ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ 200 మీటర్ల జాతీయ పతాకాన్ని పిల్లలచే ప్రదర్శించడం ఇదే మొట్ట మొదటిసారని తెలిపారు. మున్సిపల్ చైర్మెన్ ఎన్నబోయిన అంజనేయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకముందు ఎలా వుండే వాళ్ళమో వచ్చిన తరువాత ఎలా ఉంటున్నాము అనే విషయాలను ఆ నాటి స్వాతంత్ర సమరయోదులు పడ్డ శ్రమను గుర్తుంచుకోవాలన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ధనుంజయులు మాట్లాడుతూ, సమస్త అనారోగ్యాలకు పరిష్కారం పరిశుభ్రత, ఆరోగ్య నియమాలు అని తెలిపారు.
హెరిటేజ్ టూర్..
ప్రపంచ పర్యాటక వారోత్సవాలో భాగంగా మంగళవారం హెరిటేజ్ టూర్ కార్యక్రమం నిర్వహించారు. కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన సుమారు 100 మందిని బాల బాలికలను స్థానిక భువనగిరి ఖిల్లాను, ర్యాక్క్లైంబింగ్ స్కూల్‌ను సందర్శింపజేేశారు, అనంతరం ఈ విజ్ఞాన విహార యాత్రలో భాగంగా కొలనుపాక జైన మందిర్ , మ్యూజియం , రాజాపేట కోట తదితర చారిత్రాత్మక ప్రదేశాలను చూపించడం కోసం ఏర్పాటు చేసిన బస్సు యాత్రకు జిల్లా అడిషనల్ కలెక్టర్, దీపక్ తివారీ జెండా ఊపి ప్రారంభించారు .ఈ కార్యక్రమలలో సీబ్ల్యూసీ చైర్మెన్‌్ శ్రీదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి కష్ణవేణి మున్సిపల్ వైస్చైర్మెన్చింతల కిష్టయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఇడి శ్యాంసుందర్ ,జిల్లా అధికారులు, కష్ణవేణి , బాలాజీ , వెంకట్ రెడ్డి , అంజయ్య, వినోద్, పాల్గొన్నారు.