Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చిట్యాల
అఖిలభారతస్థాయిలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆ పార్టీతో దేశానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విమర్శించారు.పార్టీ చిట్యాల మండల ఏడవ మహాసభ పట్టణంలోని లక్ష్మీగార్డెన్స్‌లో బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన జెండా ఆవిష్కరణ చేసి, అమరులకు నివాళులర్పించి మాట్లాడారు.ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు పరుస్తున్న బీజేపీతో పెనుప్రమాదం పొంచి ఉందన్నారు.దేశంలో సాగుతున్న మతోన్మాద రాజకీయాలు చేస్తూ మత సామరస్యానికి తీవ్ర ఆటంకం కలుగిస్తుందన్నారు.స్వాతంత్రోద్యమ పోరా టాన్ని, సాయుధ తెలంగాణపోరాటాలను బీజేపీ వక్రీకరిస్తుందన్నారు.వివిధ మతాలు,కులాలు, భాషలతో కూడిన విభిన్న సంస్కతి గల దేశం భారతదేశమన్నారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విలువలు స్వాతంత్రోద్యమ విలువలకు వ్యతిరేక విధానాలు కొనసాగు తున్నాయన్నారు. ప్రయి వేటీకరణ విధానాలను చాలా స్పీడ్‌గా తీసుకొస్తూ అంబానీ,ఆధాని చేతిలో దేశాన్ని పెట్టడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తుందని విమర్శించారు.ప్రజల్లో తిరుగుబాటు ఉద్యమాలు వస్తున్నాయని గ్రహించి ఉద్యమాలను అణిచివేయాలని చూస్తుం దన్నారు. పార్లమెంట్లో మందబలం ఉందన్నారు.రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ప్రజలు, రైతులు, కార్మికుల్లో భయాందోళన పరిస్థితులు నెలకొంటుందన్నారు.నిత్యావసరాల ధరల పెంపులో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. పెట్రోల్, డీజిల్‌ధరల పెంపుపై దేశానికి ఆరులక్షల కోట్లకు పైగా ఆదాయంవచ్చిందన్నారు కరోనా నియంత్రణ చేయకపోవడం, చిన్నపరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేయబోతున్నామన్నారు.ఉద్యమాలలో ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు. అన ంతరం టౌన్ కమిటీ కార్యదర్శిగా అవిశెట్టి శంకరయ్య, రూరల్ మండల కార్యదర్శిగా అరూరి శ్రీనులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.చిట్యాల టౌన్ మండల కమిటీ 11 మందితో రూరల్ మండల కమిటీని 15 మందితో ఎన్నుకున్నారు. ఈకార్యక్ర మంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందాల ప్రమీల, జిల్లా నాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, అరూరి శ్రీను, శీలా రాజయ్య, జిట్ట సరోజ, పార్టీ మండల నాయకులు పామనుగుళ్ళ అచ్చాలు, నారబోయిన శ్రీనివాసులు, కత్తుల లింగస్వామి, రుద్రారపు పెద్దులు, ఐతరాజు నర్సింహ పాల్గొన్నారు.