Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
పత్తి కార్మికులకు సామాజిక భద్రత, గౌరవప్రదమైన వత్తి కల్పిచేందుకు ఐఎల్ఓ కృషి చేస్తుందని ఐఎల్ఓ జాతీయ కోఆర్డినేటర్ రంజిత్ ప్రకాష్ పేర్కొన్నారు.బుధవారం నల ్లగొండలోని రెన్సీ హోటల్లో జరిగిన ఏఐటీయూసీ, ఐఎల్ఓ జిల్లావర్క్షాప్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐఎల్ఓ పాటు పడుతుం దన్నారు.పత్తికార్మికులకు సామాజిక భద్రత గౌరవప్రదమైన వృత్తే లక్ష్యంగా కషి చేస్తామన్నారు.స్త్రీ పురుషుల మధ్య వేతనాల్లో వ్యత్యాసం లేకుండా బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడం కోసం అందరం సమిష్టిగా కషి చేయాలని పిలుపునిచ్చారు.ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి బీవీ.విజయలక్ష్మీ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఐఎల్ఓ సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో కార్మికుల స్థితిగతులపై ఏఐటీయూసీ అధ్యయనం చేస్తుందన్నారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం బీమాసౌకర్యం కల్పించాల్సిన అవసర ముందన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్డీ చంద్రశేఖర్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ మహమ్మద్ హలీం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.కాంతయ్య, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన,ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎన్.సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ చాపలశ్రీను, సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు రైతుసంఘం జిల్లా కార్యదర్శి జి రామచంద్రం, చండూరు వైస్‌ఎంపీపీ మందడి నర్సింహారెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ మైన్ ఉద్దీన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బరిగెల వెంకటేష్, పద్మ, లెనిన్, రవి, లింగం, దోటి వెంకన్న, దేవయ్య పాల్గొన్నారు.