Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
రాష్ట్ర గవర్నర్ తమిళ సైసౌందర్రాజన్ గురువారం నల్లగొండకు రానున్నారు.గవర్నర్ పర్యటన సందర్భంగా అధికారులు పలు ఏర్పాట్లు పూర్తి చేశారు.గవర్నర్ ముందుగా జిల్లాకేంద్రంలోని డాక్టర్ కంచర్ల కష్ణచైతన్య డాక్టర్ ఇటికాల సింధూర, ఆధ్వర్యంలో నెలకొల్పిన నూతన సింధూర మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రినిభవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ఇండియన్ రెడ్‌క్రాస్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె పాల్గొంటారు.తర్వాత పానగలు ఛాయా సోమేశ్వర ఆలయం ప్రాంగణంలో ఐదు మొక్కలు నాటి ప్రత్యేకపూజలు చేయనున్నారు.అనంతరం అన్నెపర్తి పరిధిలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్లో పాల్గొని బతుకమ్మ సంబురాలకు హాజరైన బతుకమ్మ ఆడనున్నారు.పర్యటన సందర్భంగా పానగల్ పచ్చల, ఛాయాసోమేశ్వర ఆలయాల్లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ దగ్గరుండి పనులను పూర్తి చేయించారు
గవర్నర్ పర్యటనతో రోడ్లకు మరమ్మతులు
గవర్నర్ తమిళసైసౌందర్రాజన్ గురువారం జిల్లా పర్యటన సందర్భంగా ఆర్అండ్బీ అధికారులు జిల్లాకేంద్రంలో రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను మున్సిపల్ అధికారులు తొలగించారు.గవర్నర్తమిళ సైసౌందర్ రాజన్ నల్లగొండ పర్యటన సందర్భంగా జిలా కేంద్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.గవర్నర్ పర్యటన సందర్భంగా జిలా ్లకేంద్రంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పర్యటన ఇలా...
ఉదయం 9గంటలకు రాజ్‌భవన్ నుండి బయల్దేరి 10.45కు ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటుంది.11 గంటలకు సింధూర హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.11.45 గంటలకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించనున్నారు.12.20 గంటలకు పానగల్ పచ్చల, ఛాయా సోమేశ్వర ఆలయాల్లో మొక్కలు నాటి ప్రత్యేక పూజలు నిర్వహించ నున్నారు.12.40 గంటలకు మహాత్మాగాంధీ యూని వర్సిటీలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించ నున్నారు. మధ్యాహ్నం 1.00 గంటలకు లంచ్ చేయనున్నారు.