Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
మండలంలోని మునిపంపుల గ్రామంలో చెర్వు కింద బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శివర్గ సభ్యుడు యాదాసు యాదయ్య మాట్లాడుతూ అలుగు నుండి వరద ఉధతి ప్రవహిస్తున్న ప్రజలు, రైతులు, ప్రయాణికులు ఆ దారి వెంట నడవలేని పరిస్థితి నెలకొందన్నారు. నిత్యం వందలాది మంది నడిచే లక్ష్మాపురం ప్రధాన రహదారి చెర్వుకింద బ్రిడ్జి లేకపోవడంతో రైతులు, బాటసారులు, గీత కార్మికులు నరకయాతన పడుతున్నారన్నారు. మునిపంపుల-లక్ష్మాపురం దారి బురదమయమై కనీసం నడవలేని పరిస్థితి ఉందన్నారు. వెంటనె ప్రభుత్వం స్పందించి బీటీ రోడ్డు, అలుగులపై నూతన బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ శాఖ కార్యదర్శి తొలుపునూరి శ్రీనివాస్, మత్స్యకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జోగుల శ్రీనివాస్, ఎండి. మైనొద్దిన్, జంపాల ఉమాపతి, బూడిద భిక్షం, గంటెపాక శివ కుమార్, ఉండ్రాతి నర్సింహ, తొలుపునూరి చంద్రశేఖర్, మేకల జలెందర్, మేడి ముకుందం, గునుగుంట్ల సత్యనారాయణ, ఆకుల ఉపేందర్, జోగుల సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.