Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు సేవలందించిన వారిలో ముందున్న మున్సిపల్ కార్మికులు, సిబ్బంది, అంగన్వాడీ టీచర్లకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. బుధవారం ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, సిబ్బంది, అంగన్వాడీ టీచర్లను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా అరికట్టేందుకు అహర్నిశలు కషి చేస్తున్న ముందువరుసలో ఉన్న సేవకులకు ఏమిచ్చినా తక్కువేనన్నారు.సేవా సప్తాV్‌ా కార్యక్రమాలలో భాగంగా మున్సిపల్ సిబ్బందిని ప్రశంసించండం సంతోషంగా ఉందన్నారు. కుటుంబాలకు సైతం దూరమై ప్రాణత్యాగాలకు వైనుకాడక కరోనా అంతమొందించడానికి సేవలందించిన వారికి చేతులెత్తి మొక్కాల్సిం దేనన్నారు.వ్యాక్సిన్ పంపిణీలో ముందున్న అంగన్వాడీ టీచర్లు, పారిశుధ్య సిబ్బందికి శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు అన్నెపర్తి యాదగిరి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోమటి వీరేశం, మున్సిపల్ కౌన్సిలర్ గుంటి వెంకటేశం, సింగిల్ విండో డైరెక్టర్ బోడ ఆంజనేయులు, సోమ నర్సింహ, పిన్నింటి నరేందర్, జిల్లా నాయకులు దర్శణం వేణు, సముద్రాల వెంకన్న, మహిళా మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి సముద్రాల ఉమారాణి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపాటి సతీష్, చిలుకూరి అశోక్, రావిరాల శ్రీను, షేక్ రశీద్, భూతరాజు దేవదాసు, పేర్ల గణేష్, పార్టీ ప్రధానకార్యదర్శులు నకిరెకంటి లింగస్వామి గౌడ్, సత్యం, తడకమళ్ళ శ్రీధర్, ముదిగొండ అంజనేయులు, కొత్త అంజిబాబు, మున్సిపల్ యువమోర్చా అధ్యక్షులు సోమ శంకర్ పాల్గొన్నారు.