Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి గీతకార్మికుడు కిందపడి మృతిచెందిన సంఘటన బుధవారం మండలంలోని కొమ్మాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు..స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోతగాని అశోక్‌గౌడ్ (43) రోజువారీవత్తిలో భాగంగా కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు చెట్టు పైనుండి జారి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే జనగామ ఏరియాస్పత్రికి తరలించారు. డాక్టర్ పరిశీలించి అప్పటికే మతి చెందినట్టు తెలిపారు. మతునికి కూతురు, కుమారుడు ఉన్నారు. మతుని తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పంచనామా చేసి పోస్టుమార్టం నిర్వహించినట్టు ఎస్ఐ బి.తిరుపతి తెలిపారు.