Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
పట్టణంలో బుధశారం ఎంగిలిపువ్వు బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. నూతన వస్త్రాలను ధరించి భక్తి శ్రద్ధలతో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఒకదగ్గర పెట్టి ఆడిపాడారు.పట్టణంలోని సంతోషిమాత దేవాలయం, రంగనాయక వీది, శివాలయం, పోచమ్మ దేవాలయం, ఎస్సీకాలనీ, బీసీ కాలనీ,పట్టణంలోని వ్యాపార సముదాయాల వద్ద , ఆదర్శనగర్ ,భరత్ నగర్, కురుమ సంఘం ,రైల్వే గేట్ సమీప కాలనీలలో మహిళలు సామూహికంగా బతుకమ్మ ఆడి పాడారు. అనంతరం బతుకమ్మలను పెద్దవాగులో వదిలేశారు .మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య లైటింగ్, విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు సిహెచ్. సునీత శ్రీనివాస్ రెడ్డి , డీలర్ల సంఘం భూపతి, బేతి రాములు, జూకంటి శ్రీకాంత్, కందుల శ్రీకాంత్, గుత్తా శమంత రెడ్డి, దాసరి నాగలక్ష్మి సంతోష్, మొర్తాల సునీత రమణారెడ్డి, రాయాపురం నరసింహులు, ఎర్ర దయమని దేవదానం పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ సంబరాలు బుధవారం నిర్వహించారు. మహిళలు బతుకమ్మలను పేర్చి ఒక్కదగ్గర పెట్టి ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ,బక్క రాంప్రసాద్, వడ్ల నవ్య శోభన్ బాబు, పులగం పద్మ యాది రెడ్డి, కోటగిరి జయమ్మ ,బండ పద్మ పర్వతాలు, సిరిగిరి అనిత విద్యాసాగర్ ,సమరసింహా రెడ్డి, శ్రీశైలం పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : పట్టణకేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాలలో బుధవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దామోదర్ రెడ్డి, ఎడ్ల తిరుమల్ రెడ్డి ,సిహెచ్ సుధా శ్యామల, లలిత, కుసుమాంజలి, సంధ్య ,సంతోష పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని పలుగ్రామాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ,ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మోత్కూర్: మున్సిపల్ కేంద్రంతో పాటు గ్రామాల్లో బుధవారం మహిళలు ఎంగిలిపువ్వు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పువ్వులతో మహిళలు బతుకమ్మలను ఆకర్షణీయంగా అలంకరించి ఎత్తుగా పేర్చారు. మున్సిపల్ కేంద్రంలో ఉన్నత పాఠశాల, వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మహిళలు బతుకమ్మ ఆడేందుకు పెద్ద చెరువు వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. కరోనా తర్వాత బతుకమ్మ పండుగను స్వేచ్ఛగా గతంలో లాగా జరుపుకున్నారు. అనంతరం స్థానిక కుంటలు, చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, వైస్ చైర్మెన్ బి.వెంకటయ్య, కౌన్సిలర్లు బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, పురుగుల వెంకన్న, కారుపోతుల శిరీష, సర్పంచులు దండెబోయిన మల్లేష్, అండెం రజిత రాజిరెడ్డి, వర్రె కవిత శ్రీను, ఉప్పల లక్ష్మీ, పేలపూడి మధు, ఎలుగు శోభసోమయ్య, మరిపెల్లి యాదయ్య, పైళ్ల విజయనర్సిరెడ్డి, రాంపాక నాగయ్య, బత్తిని తిరుమలేష్ పాల్గొన్నారు.
భువనగిరి: ఎంగిలిపువ్వు బతుకమ్మ సంబరాలను మహిళలు పెద్ద ఎత్తున బుధవారం ఘనంగా నిర్వహించారు.తీరొక్క పూలతో(ముచ్చాల పువ్వు, గునుగు, తంగెడు, చిట్టి చెమంతి, బంతి, చేమంతి, గుమ్మడి, రోకలిబండ తదితర పువ్వులతో) బతుకమ్మలను రంగు రంగు ల తో తీర్చిదిద్దారు. గౌరమ్మ లతో పూజించి చౌరస్తా వద్ద లేక ఊరు బొడ్రాయి వద్ద బతుకమ్మలను పెట్టి పాటలు పాడుతూ ో సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రమైన భువనగిరిలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడే ప్రదేశాలలో పారిశుధ్య పనులు నిర్వహించారు. గ్రామాల్లో వివిధ చెరువుల వద్ద బతుకమ్మ ఆడే విధంగా ఏర్పాట్లు చేశారు. అనంతరం నిమజ్జనం చేశారు. పప్పు బెల్లంతో చేసిన ప్రసాదాలు పంచుకున్నారు.
గుండాల : ఎంగిలి బతుకమ్మ పండుగ బుధవారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మరిపడిగ గ్రామంలో ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్ పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళా సర్పంచ్‌లు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చౌటుప్పల్ : మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క రకాల పూలతో బతుకమ్మలను పేర్చి కూడలి ప్రాంతాల వద్ద, దేవాలయాల వద్ద పెట్టి ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు, వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్లు, మహిళలు, యువతులు పాల్గొన్నారు.
బొమ్మలరామరం: మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బతుకమ్మలను పేర్చి ఒకచోట పెట్టి ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.