Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశావహుల హడావుడి..
- రేసులో బూడిద, నల్లమాస, మొగిలి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా టీిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఎన్నుకోవడానికి ఇటీవల సంస్థాగత ఎన్నికలు నిర్వహించారు. సంస్థాగత ఎన్నికలలో భాగంగా గ్రామ ,మండల కమిటీలను ఎన్నుకున్నారు. అక్కడక్కడా చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కమిటీల ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష పీఠంపై జిల్లాలో జోరుగా చర్చ కొనసాగుతోంది. యాదాద్రి పీఠం కోసం ఎదురు చూస్తున్న ఆశావహులు యాదాద్రి భువనగిరి జిల్లా 2015లో ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షులు ఎన్నుకోలేదు. జిల్లా పునర్విభజన తర్వాత మొదటిసారిగా యాదాద్రి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ప్రధానంగా రేసులో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ జిల్లా అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఈయనతోపాటుగా వంగాల వెంకన్న గౌడ్, వలిగొండ మాజీ జెడ్పీటీసీ మొగిలి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్ పోటీపడుతున్నారు. భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ నలమాస రమేష్ గౌడ్ 2001 ఉద్యమ ప్రస్థానం నుంచి కేసీఆర్ అడుగులో అడుగు వేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పార్టీ పటిష్ట పరచడానికి చాలా కషి చేశారు. 2001-14 వరకు ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2001లో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు తిప్పన విజయసింహారెడ్డి హయాంలోనూ ప్రధాన కార్యదర్శి పని చేశారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్ జిల్లా చైర్మెన్‌గా ఉన్నప్పుడు , బీరవోలు సోమిరెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలోనూ, బండా నరేందర్ రెడ్డి పనిచేసిన కాలంలోనూ ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా పార్టీకి సేవలందించారు. ఆయన ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తించిన పార్టీ ఇటీవల భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా ఎంపిక చేసింది. ఆశావహులు చాలానే ఉన్నప్పటికీ అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందో అనేది వేచి చూడాల్సిందే...