Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య
నవతెలంగాణ-తుర్కపల్లి
తుర్కపల్లి మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో భారీగా అవకవతకలు జరిగాయని, బాధ్యులను కఠినంగా శిక్షించి రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పల్లెపహాడ్ కేంద్రంలో నే సుమారు రూ.20 లక్షల అవినీతి జరిగిందని, మిగతా కేంద్రాల్లో ఎంత జరిగిందో విచారణ చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులే ఉన్నారని, ఎమ్మెల్యే, డీసీసీబీచైర్మెన్ స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. రెండు, మూడు రోజుల్లోనే అవినీతి చేసిన వారిని శిక్షించి రైతులకు న్యాయం చేయకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు,రాస్తారోకోలు నిర్వహిస్తామని, రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి చేపడ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ధనావత్ శంకర్ నాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి గుడిపాటి మధుసూదన్ రెడ్డి, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు ధనావత్ భాస్కర్ నాయక్, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి డొంకేన వెంకటేష్, ఎంపీటీసీలు కానుగంటి శ్రీనివాస్, ధనావత్ మోహన్ బాబు నాయక్, సర్పంచులు బానోత్ బిచ్చు నాయక్,బాబు నాయక్ పాల్గొన్నారు.