Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చింతలపాలెం
అక్రమంగా తయారు చేస్తున్న 10 లీటర్ల సారా, 600 లీటర్ల పానకాన్ని పట్టుకున్నట్టు ఎక్సైజ్ ఎస్సై మహమ్మద్ ఫజాలుద్దీన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని యర్రకుంటతండా గ్రామ శివారులో సారా తయారు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసినట్టు తెలిపారు. ఈ దాడిలో సుమారు 10 లీటర్ల సారార, 600 లీటర్ల పానకాన్ని పట్టుకున్నట్టు పేర్కొన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఈ దాడుల్లో సివిల్ ఎస్సై రమేష్, సిబ్బంది రుక్మారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సాగర్, రవి, నాగయ్య, నాగరాణి, శారద, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.