Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట
తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో ఈ నెల 12న నిర్వహించనున్న దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గొల్ల, కురుమ నవ నిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దాసరి నగేష్ యాదవ్ కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో విగ్రహావిష్కరణ కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. గొల్ల, కురుమ కుటుంబంలో జన్మించిన దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి భవిష్యత్ తరాలకు తెలిసేలా ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించి ప్రభుత్వమే అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ది రమేష్‌యాదవ్, రాష్ట్ర కార్యదర్శి బుక్క రాజు, తిరుపతియాదవ్, రాష్ట్ర యూత్ కన్వీనర్ చెరుకూరి శేఖర్‌యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వి.బుడిగె మల్లేష్‌యాదవ్, జిల్లా నాయకులు నూకల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.