Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన లబ్దిదారులకు బుధవారం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను హైదరాబాద్‌లోని తన నివాసంలో అందజేశారు. ఆవుల కాశమ్మకు రూ.60వేలు, సుష్మకు రూ.16వేలు, సంగిశెట్టి ఎల్లయ్యకు రూ.లక్ష, యాదమ్మకు రూ.60వేలు, శివనందినికి రూ.60వేల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మెన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, గుండెబోయిన వెంకటేశ్‌యాదవ్, తంగడపల్లి మాజీ సర్పంచ్ ముటుకులోజు దయాకరచారి, నాయకులు సుర్కంటి మహేందర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, ఊదరి నర్సింహా, వీరమల్ల సత్తయ్యగౌడ్, బొడ్డు ముత్యం, రమణగోని రఘు, సతీశ్, జిట్టా కష్ణ, దుర్గయ్య పాల్గొన్నారు.