Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వనం రాజు
నవతెలంగాణ-బీబీనగర్
అధికారులు పేద విద్యార్థులకు చదువును దూరం చేస్తూ వారి జీవితాలతో చెలగాటమా డుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వనం రాజు అన్నారు. బుధవారం మండలపరిధిలోని లక్ష్మీదేవిగూడెం గ్రామ పరిధిలో గల సాంఘిక సంక్షేమ సైనిక మహిళా గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గురుకుల కళాశాలలో డిగ్రీ కోర్సులను ఎత్తివేసి అణగారిన పేద, దళిత విద్యార్థులకు చదువును దూరం చేస్తున్నారన్నారు. 2018లో సైనిక కళాశాలగా గుర్తించారని, ఆర్మీ శిక్షణ ఇవ్వడం ప్రారంభించారని తెలిపారు. శిక్షణ పేరుతో బీజెడ్సీ, ఎంబీజెడ్‌సీ, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్ లాంటి కోర్సులను ఎత్తివేసి ప్రస్తుతం ఎంపీసీ, బీఏ కోర్సులకు మాత్రమే విద్యాబోధన చేస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే అధికారులు స్పందించి ఎత్తివేసిన కోర్సులను పునర్ ప్రారంభించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండలకార్యదర్శి సందెల రాజేశ్, జిల్లా నాయకులు చింతల శివ, రాహుల్, మండల నాయకులు పవన్, నవీన్, భగత్, సాయికుమార్ పాల్గొన్నారు.