Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మఠంపల్లి
బతుకమ్మ చీరల పంపిణీలో గ్రామ సర్పంచ్ అయిన తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా ప్రొటోకాల్‌ను విస్మరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మండలంలోని వరదాపురం సర్పంచ్ బచ్చలకూరి అఖిల బుధవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది, ప్రస్తుతం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీలో తనకు అవమానం జరిగిందని వాపోయారు. మండల అధికారులు అధికార పార్టీకి అంటకాగుతూ దళిత మహిళా సర్పంచ్ అయిన తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.