Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముషంపల్లి మృతురాలి కుటుంబానికి మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ
- రూ. 10 లక్షల ఆర్థిక సాయం
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలోహత్యకు గురైన ధనలక్ష్మి కుటుంబాన్ని బుధవారం విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి పరామర్శించారు.ధనలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిందితుల కు కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు ఎక్స్రేగ్రేషియాను అందజేస్తున్నట్టు తెలిపారు. మృతురాలి కుటుం బానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, పట్టణాధ్యక్షులు పిల్లి రామరాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.