Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట
పేదింటి ఆడపడుచులకు ప్రభుత్వం కానుక బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తోందని 27వ వార్డు కౌన్సిలర్ సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాల మేరకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
నూతనకల్: మండల పరిధిలోని దిర్శనపల్లి గ్రామానికి చెందిన మహిళలకు బుధవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ బాధవత్ సావిత్రిచక్రధర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా దసరా పండగకు చీరలు పంపిణీ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుర్రం అమృతమ్మ, పంచాయతీ కార్యదర్శి తాళ్లపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
పెన్‌పహాడ్: బంగారు తెలంగాణ ఏర్పాటుకు మహిళలు ముందుండాలని జెడ్పీటీసీ మామిడి అనితఅంజయ్య కోరారు. మండల పరిధిలోని దుపహాడ్ గ్రామంలో బుధవారం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి ఆడ బిడ్డ మోహంలో చిరునవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ బిట్టు నాగేశ్వర్రావు, ఉప సర్పంచ్ మద్దెల గీతాంజలి, పుష్పవతి, మాజీ సర్పంచ్‌లు సోమయ్య, భద్రయ్య, పంచాయతీ కార్యదర్శి నెహ్రు పాల్గొన్నారు.
మండల పరిధిలోని తంగేళ్లగూడెం గ్రామంలో చీదెళ్ల పీఏసీఎస్ చైర్మెన్ వెన్న సీతారాంరెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాదే ఈశ్వరమ్మధర్మయ్య, ఉపసర్పంచ్ దేశగాని శ్రీనివాస్, కుక్కడపు నరేష్, కాశయ్య, సుధాకర్, శ్రీనివాస్, వీరాస్వామి, రామారావు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : మండల పరిధిలోని రామలక్ష్మిపురం, బిఖ్యాతండా, తోగార్రారు, గణపవరం, ఎర్రవరం గ్రామల్లో బుధవారం ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. లక్ష్మీపురం గ్రామంలో రకరకాల పూలతో బతుకమ్మలను తయారుచేసి మహిళలు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మందలపు కృష్ణకుమారిశేషు, వైస్ ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య, సర్పంచులు బానోతు అంబేద్కర్, పొట్టా శ్రీవిజయ కిరణ్, దొంగల లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ మండధ్యక్షులు,కాపుగల్లు సర్పంచ్ కాసాని వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి, కూచిపూడి సర్పంచ్ శెట్టి సురేష్‌నాయుడు, గ్రామ శాఖల అధ్యక్షులు ముడియాల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్: మండల పరిధిలోని దాస్తండా గ్రామంలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జీడి బిక్షం ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. బుధవారం ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాసనాయుడు, సర్పంచ్ విజయ మోతిలాల్, ఉప సర్పంచ్ బుజ్జి బాలు, గ్రామ కార్యదర్శి లలిత, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు వంగాల శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు మోతిలాల్, గ్రామ శాఖ అధ్యక్షులు రాంబాబు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసనాయుడు, సోమ్లా నాయక్, లింగయ్య, శంకర్, భాష తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: మండల పరిధిలోని వాయిలా సింగారం గ్రామంలో ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. 18 ఏండ్లు నిండిన కోటి మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్ర రజిత, ఉప సర్పంచ్ స్రవంతి, వీఆర్వో రవి కిరణ్, కొల్లు సుబ్బారావు, కంటు నాగార్జున, వెంకన్న, శ్రీను, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.