Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట
తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి సతీమణి, ఎస్ ఫౌండేషన్ చైర్మెన్ గుంటకండ్ల సునీత, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జా దీపికాయుగేందర్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితా ఆనంద్‌తో పాటు పలువురు మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి తీరొక్కపూలతో బతుకమ్మ పేర్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల నడుమ ఆటాపాటలతో ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు నీటితో నిండి ఉన్నాయని, బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఏర్పాటు పరిశీలన
జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువును మంత్రి మంగళవారం రాత్రి పరిశీలించారు. చెరువులో బతుకమ్మలు వదిలే ప్రాంతాన్ని, చెరువు కట్ట, మహిళలు బతుకమ్మ ఆడి, పాడే ప్రాంగణాన్ని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
తుంగతుర్తి: తెలంగాణ సంస్కతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను బుధవారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలంయాదవ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు నల్లు రాంచంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ పులుసు యాదగిరిగౌడ్, గ్రంథాలయ చైర్మెన్ గోపగాని రమేష్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షులు తిరుమలప్రగడ కిషన్‌రావు, బీజేపీ మండలాధ్యక్షులు గాజుల మహేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా, మండల టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు పోగుల శ్రీకాంత్‌రెడ్డి, ఎన్ఎస్యూఐ నియోజకవర్గ నాయకులు కొండ నాగరాజు పాల్గొన్నారు.
మద్దిరాల: ఎంగిలి బతుకమ్మ పండుగను బుధవారం మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొని మహిళలు చెరువు దగ్గర పెట్టి బతుకమ్మ పాటలు పాడారు.
నాగారం : మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన మహిళలు బుధవారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు మహేశ్వరీ, మామిడి అనిత, లక్ష్మమ్మ, స్వప్న, రజిత, పూలమ్మ తదితరులు పాల్గొన్నారు.
అర్వపల్లి: ఎంగిలి బతుకమ్మను మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన మహిళలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. కుంచమర్తి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ రేణుక, మహిళలు పాల్గొన్నారు.
పెన్‌పహాడ్: మండల వ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు, చిన్నపిల్లలు రంగు రంగుల పూలతో బతుకమ్మలు పేర్చుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన కూడళ్లలో ఆడి పాడారు. అనంతరం సమీపంలోని చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
నూతనకల్: మండల కేంద్రం, మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ మహిళలు బుధవారం ఎంగిలిపూల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలతో బతుకమ్మ పేర్చి ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, చిన్నారుల పాల్గొన్నారు.
మోతే: సంస్కతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండగ ప్రతీక అని సర్పంచులు మెట్టు అలివేలు అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఎంగిలిపూల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు కారింగుల సరిత, శైలజ, కందిబండ వెంకటరమణ, వసంత, మామిడి మౌనిక, మద్ది చైతన్య, కోలా సావిత్ర, కోల పద్మ తదితరులు పాల్గొన్నారు.
చివ్వేంల: మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లోనూ బుధవారం ఎంగిలి పూల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.