Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ సంస్కతికి, తెలంగాణ అడబిడ్డల వ్యక్తిత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సతీమణి రమాదేవి అన్నారు.బుధవారం తెలంగాణ బతుకమ్మ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎంగిలిపువ్వు బతుకమ్మ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మను పేర్చడంతో పాటు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.ఈ సందర్భంగా కంచర్ల రమాదేవి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పువ్వులతో భగవంతునికి పూజ చేయడం ఆనవాయితీ అని తెలంగాణ మహిళలు ప్రకతి అందించే వివిధ రకాల పువ్వులను గౌరీదేవి అలంకారంగా భావించి పువ్వులకు పూజ చేయడం ఎక్కడా లేదన్నారు.బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి, వ్యక్తిత్వానికి ప్రతిబింబమని చెప్పారు.మన సంస్కతిని, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బతుకమ్మ కమిటీ అధ్యక్షురాలు రావుల రేణుక, మాలే శరణ్యారెడ్డి, దైద రజిత, సింగం లక్ష్మీ, కేతిరెడ్డి కవిత, ఉమా, శైలజ, పులిమామిడి శోభ, ధనలక్ష్మి, మామిడి పద్మ, దుబ్బరూప, కత్తుల సంధ్య, దానంపల్లి విమల, గాదెలక్ష్మీ, బండఅరుణ, మాధవి, సులోచన, కంచర్ల విజయ, సరస్వతి, భాగ్యమ్మ,మంగమ్మ, శ్రీలత, భార్గవి, సింధు పాల్గొన్నారు.
అదేవిధంగా మండలంలోని తొరగల్ గ్రామంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మ తయారు చేసి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కంబాల శివలీల,సత్యమ్మ, ఈశ్వరమ్మ, భవాని, శ్రావణి, లక్ష్మీ, శ్రీజ, అనిల్, శారద, చందన పాల్గొన్నారు.
అదేవిధంగా పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.తీరొక్కపూలు, వివిధ రంగులతో బతుకమ్మలను పేర్చారు.ఆటల, పాటలతో నృత్యాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఈదులకంటి నగేష్‌గౌడ్, పెంచెల కృష్ణ, అనసూర్య, లక్ష్మమ్మ, లీల, శ్రీదేవి, పల్లవి, అమృతమ్మ, పుష్పమ్మ, పాల్గొన్నారు.
కేతెపల్లి: మండలంలోని వివిధ గ్రామాలలో ఎంగిలి పూవు బతుకమ్మ పండుగను మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రంగు రంగుల పూలతో చాలా అందంగా బతుకమ్మను పేర్చి గ్రామాలలో దేవాలయాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలాలలో బతుకమ్మలను ప్రదర్శనగా ఉంచి పాటలు పాడుతూ నత్యాలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు.
చండూరు: మండలంలోని ఎంగిలి పువ్వు బతుకమ్మను తీరొక్క పువ్వుల తో, రంగు రంగు పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న, కౌన్సిలర్లు కోడి వెంకన్న, గుంటి వెంకటేశం, అన్నెపర్తి శేఖర్, కొండ్రెడ్డి యాదయ్య, సముద్రాల ఉమారాణి పాల్గొన్నారు.
మిర్యాలగూడ: పట్టణంలోని విజేత డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సంబురాలు ఘనంగా నిర్వహించారు.విద్యార్థినులు బతుకమ్మలను పేర్చుకొని సంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ తెడ్ల ధనుంజయ మాట్లాడుతూ ప్రకతిలో దొరికే రకరకాల పువ్వులతో పండుగ చేయడం తెలంగాణ ప్రాంతానికే గర్వకారణమన్నారు. ప్రకతితో మానవునికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తూ పువ్వులను పూజించడం మన అదష్టమన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రామేశ్వరి, రమాదేవి, జ్యోతి, సునీత, హరికష్ణ, నాగయ్య, శ్రీనివాస్, వెంకటేశ్, బాలకష్ణ పాల్గొన్నారు.
నాగార్జునసాగర్: పైలాన్‌కాలనీలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మహిళలు బతుకమ్మ పాటలు పాడారు.అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు.
చింతపల్లి: మండలంలోని గొల్లపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు జెడ్పీటీసీ కంకణాల ప్రవీణవెంకట్‌రెడ్డి హాజరై మాట్లాడారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ ఆడపడుచులు పాల్గొని బతుకమ్మ వేయడం జరిగింది.